సింగరేణికి 34 కోట్ల ఆదా.. సీఎండి శ్రీధర్ అభినందనలు..

185
N sridar
- Advertisement -

సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో భాగంగా భూపాలపల్లిలో 10 మెగావాట్ల సోలార్ ప్లాంటును సింగరేణి ఉన్నతాధికారులు డైరెక్టర్ ఫైనాన్స్ ప్లానింగ్ పర్సనల్ ఎన్. బలరాం. డైరెక్టర్ ఈ అండ్ ఎం సత్యనారాయణరావు సోమవారం (జూన్ 31)న ప్రారంభించారు. దీనితో సింగరేణి సంస్థ తాను నిర్మిస్తున్న 300 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లలో 162 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్లు పూర్తయ్యాయి. దీనిపై సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎం డి ఎన్. శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేశారు.మొదటి మరియు రెండవ దశలోని ప్లాంట్లు దాదాపు పూర్తయిన నేపథ్యంలో మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంట్లు అక్టోబర్ నెల కల్ల పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

అలాగే మొదటి ,రెండు దశల్లో మిగిలిన కొత్తగూడెం(37మెగా వాట్లు), రామగుండం (20 మెగా వాట్లు) ప్లాంట్లను ఈనెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా సింగరేణి సంస్థ దశలవారీగా గత ఏడాది కాలంగా ప్రారంభించిన ఆరు సోలార్ విద్యుత్ ప్లాంట్ ల నుండి మే 31వ తేదీ నాటికి 65 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.ఈ విద్యుత్తును ట్రాన్స్కో వారి లైన్ల ద్వారా గ్రిడ్ కు అనుసంధానం చేసిన సింగరేణి తిరిగి అదే మొత్తం విద్యుత్తును వివిధ ఏరియాల్లో తన విద్యుత్ అవసరాలకు వినియోగించుకుంది. ఈ విధంగా కంపెనీ గడిచిన కొద్ది కాలంలోనే 34.12 కోట్ల రూపాయలను ఆదా చేయగలిగింది.

ప్రాంతాల వారీగా చూస్తే మణుగూరులోని 30 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నుండి ఇప్పటివరకు 273 లక్షల యూనిట్లు, సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 10 మెగావాట్ల ప్లాంట్ నుండి 161 లక్షల యూనిట్లు, ఇల్లందులోని 39 మెగావాట్ల ప్లాంట్ నుండి 115 లక్షల యూనిట్లు, రామగుండం 30 మెగావాట్ల ప్లాంటు నుండి 61 లక్షల యూనిట్లు, విద్యుత్ ఉత్పత్తి అయింది. అలాగే రెండవ దశలో నిర్మించిన మందమర్రి ఒకటో ప్లాంట్ నుండి 16.25 లక్షల యూనిట్లు, మందమర్రిలోని 15 మెగావాట్ల రెండో ప్లాంట్ నుండి 23.56 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది.దీంతో మొత్తం మీద గత ఏడాది కాలంగా వరుసగా ప్రారంభమవుతు వస్తున్న 6 సోలార్ ప్లాంట్ నుండి ఇప్పటివరకు 65 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయింది.

మూడో దశలోని 80 ఒక మెగావాట్ల ప్లాంట్లు అక్టోబర్ నాటికి పూర్తి..
సింగరేణి నిర్మించ తలపెట్టిన 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ లో మొదటి, రెండు దశలు దాదాపు పూర్తి కాగా మూడో దశలోని 81 మెగావాట్ల ప్లాంటు నిర్మాణాలు అక్టోబర్ నాటికి పూర్తి కానున్నాయి. ఇప్పటికే కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. ఈ దశలోనే సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల భారీ జలాశయం నీటిపై 15 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లను నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించి నీటిపై తేలియాడే ఎయిర్ ట్యూబుల తయారీ కేంద్రాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు. మొదటి దశ ప్లాంటుల్లో నిర్మాణం చివరిలో ఉన్న రామగుండం-3లోని 20 మెగావాట్ల విభాగం, రెండవ దశలోని కొత్తగూడెం (37 మెగావాట్ల) సోలార్ ప్లాంట్ పనులు జూన్ నెల కల్లా పూర్తి కానున్నాయి.

మిడ్ మానేరు డ్యాం పై సోలార్ ప్లాంట్ సర్వేకు అనుమతి..
ఇదిలా ఉంటే సింగరేణి సంస్థ కరీంనగర్ వద్ద మానేరు డ్యామ్ నీటిపై నిర్మించతలపెట్టిన 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రతిపాదనలకు సానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక్కడి నిర్మించే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంటు నిర్మాణానికి సంబంధించి సర్వే నిర్వహించుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ వారు గత వారం అనుమతించారు. సర్వేకు అనుమతి లభించిన నేపథ్యంలో నిర్మాణ ఏజెన్సీ వారితో కలిసి సింగరేణి సంస్థ వచ్చేవారం డామ్ వద్ద నీటి వనరులు, వివిధ కాలాల్లో నీటి లభ్యత,లోతు ,ప్లాంటు నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశం, మొదలైన అంశాలు అధ్యయనం చేసి ఒక నివేదికను రూపొందించనున్నారు. సింగరేణి సంస్థ చైర్మన్ ఎన్.శ్రీధర్ ఆదేశంపై డైరెక్టర్ ఇ అండ్ యం డీ సత్యనారాయణ రావు సింగరేణి సోలార్ ప్లాంట్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్మాణ ఏజెన్సీలతో సమీక్షిస్తూ పనులు వేగవంతం చేస్తున్నారు.

- Advertisement -