మావోయిస్టు ఆగడాలను సహించేదిలేదు: డీజీపీ మహేందర్ రెడ్డి

160
dgp mahendereddy
- Advertisement -

నక్సలిజం లేకపోవడంతోనే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఏటూరు నాగారం సబ్ డివిజిన్‌లోని వెంకటాపురం పోలీస్ స్టేషన్‌లో పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్ధాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన డీజీపీ…మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులు అని మండిపడ్డారు. పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టు ఆగడాలను అడ్డుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణలో ఉండే డాక్టర్లు ,ఇంజనీర్లను, వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని పథక రచన తో తిరిగి మళ్లీ తెలంగాణలో అడుగు పెట్టాలని మావోయిస్టులు చేసే ప్రయత్నాలను తెలంగాణ పోలీస్ శాఖ సమర్థంగా తిప్పి కొడుతుందని తెలియజేశారు.

మావోయిస్టు పార్టీ అగ్రనేతలు అయిన హరి భూషణ్, దామోదర్ విలాసవంతమైన జీవితాలను గడుపుతూ అమాయక గిరిజనులను బలిపశువులుగా చేస్తున్నారని, మావోయిస్టు లకు ఎవరూ కూడా సహకరించకుండా ఉండాలని హెచ్చరించారు.

- Advertisement -