రాష్ట్రానికే తలమానికంగా ఆర్‌ అండ్ ఆర్ కాలనీ: మహేందర్ రెడ్డి

33
dgp mahender reddy

తునికి బోల్లారం ఆర్&ఆర్ కాలనీని సందర్శించారు డీజీపీ మహేందర్ రెడ్డి, సీనియర్ ఐపిఎస్ అధికారులు. కాలనీ లో నిర్వాసితులకు కల్పించిన సౌకర్యాలను డీజీపీ, సీనియర్ ఐపిఎస్ అధికారులకు వివరించిన జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి.అన్ని వసతులతో ఆర్&ఆర్ కాలనీ నిర్మాణం బాగుందని తెలిపారు మహేందర్ రెడ్డి.తునికి బోల్లారం ఆర్&ఆర్ కాలనీ రాష్ట్రానికి తలమానికంగా ఉందని చెప్పారు మహేందర్ రెడ్డి.

గ‌జ్వేల్ అట‌వీ ప్రాంతంలో డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సీనియ‌ర్ ఐపీఎస్ అధికారులు ప‌ర్య‌టిస్తున్నారు. గ‌జ్వేల్ చేరుకున్న డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి, సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి, సిద్దిపేట పోలీసు క‌మిష‌న‌ర్ జోయ‌ల్ డేవిస్ స్వాగ‌తం ప‌లికారు.

గ‌జ్వేల్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా.. ముందుగా ములుగులోని అటవీ పరిశోధన కేంద్రాన్ని ఐపీఎస్‌ అధికారుల బృందం పరిశీలించనుంది. అనంతరం కోమటిబండ రిజర్వ్‌ ఫారెస్టులో అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. తర్వాత మర్కూక్‌ కొండపోచమ్మ సాగర్‌ ప్రాజెక్టును , పంప్‌ హౌస్‌ను , గజ్వేల్‌ వెజ్‌ అండ్‌ నాన్‌ వెజ్‌ సమీకృత మార్కెట్‌ యార్డ్‌ను, కోమటి బండ మిషన్‌ భగీరథ తాగునీటి శుద్ధి కేంద్రాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు.