గ్రేటర్ ఎన్నికల ప్రచారం షురూ..

21
trs

గ్రేటర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. నేటి నుండి నామినేషన్లను స్వీకరించనుండగా అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. ఇక నామినేషన్ల పర్వానికి ముందే ప్రచారంలో నిమగ్నమయ్యారు టీఆర్ఎస్ నేతలు.

ఓల్డ్ బోయినపల్లిలో ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ప్రచారం నిర్వహించారు. ప్రజలు కలుస్తూ ఓట్లు అభ్యర్థించారు. త్వరలో జరుగనున్న గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. నగరం మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులనే ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

నేటి నుండి నామినేషన్లు స్వీకరించనుండటంతో సర్కిళ్లు, డివిజన్ల వారీగా ఏర్పాట్లు చేశారు అధికారులు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలుకుని ఎన్నికల క్రతువు నిర్వహించేందుకు డివిజన్ల వారీగా రిటర్నింగ్‌ అధికారుల చాంబర్లను ఏర్పాటు చేశారు.