తిరుమలకు పోటెత్తిన భక్తులు..

11
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 84,536 మంది భక్తులు దర్శించుకోగా 25,890 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చింది.

ఇక ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహ‌రించి భక్తులకు దర్శనమిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం వాహన సేవను ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

Also Read:లెబనాన్ ప్రధానిగా నవాఫ్ సలాం

- Advertisement -