- Advertisement -
లెబనాన్ ప్రధానమంత్రిగా నియమితులయ్యారు నవాఫ్ సలాం. దీంతో రెండేళ్ల విరామానికి బ్రేక్ పడింది. లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ అవున్.. నవాఫ్ సలాంను నామినేట్ చేయగా ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
నిరంతర యుద్ధాల కారణంగా సంక్షోభంలో ఉన్న లెబనాన్‌లో 2022లో తాత్కాలిక మంత్రివర్గం రాజీనామా చేసింది. దేశ దక్షిణ సరిహద్దులో భయాన్ని వ్యాపింపజేసిన ఇజ్రాయెల్-హిజ్బుల్లా వివాదం ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది.
క్రైస్తవులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యంతో సలాం 24 మంది సభ్యుల మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారని రాయిటర్స్ నివేదించింది.
Also Read:Delhi:ఖాతా తెరవని కాంగ్రెస్!
- Advertisement -

