మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శివలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. వేములవాడ,శ్రీశైలం,ఉజ్జయిని మహాకాలేశ్వర్, నాసిక్ త్రయంబకేశ్వర్ అన్ని ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ల్లోనూ భక్తులు భారీ సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే అభిషేకాలు, అర్చనలు జరుగుతున్నాయి.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్ ఆలయంలో పూజలు చేశారు. కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి హన్మకొండలోని వెయ్యి స్తంభాల గుడిలో పూజలు నిర్వహించారు శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు చేస్తున్నారు.
జార్ఖండ్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం,కేరళలోని కొచ్చిలో ఉన్న అలువ మహాదేవ్ ఆలయానికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారణాసిలోని కాశీ విశ్వనాథుడికి ఇవాళ ఉదయం ప్రత్యేక హారతి ఇచ్చారు. ఢిల్లీలోని గౌరీశంకర్ ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. శివరాత్రి సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో త్రినేత్రుడి దర్శనం చేసుకుంటున్నారు.
Also Read:MLC Kavitha:జీవో 3 రద్దు చేయాల్సిందే