కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ఓ సరికొత్త ఛాలెంజ్‌ను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారతీయులు ఫిట్‌నెస్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ‘హమ్ ఫిట్‌తో ఫిట్ ఇండియా ఫిట్’ అనే ఛాలెంజ్‌కు ఆయన శ్రీకారం చుట్టారు. రాథోడ్ విసిరిన ఛాలెంజ్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా కర్నాటక సీఎం కుమారస్వామికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫిట్ నెస్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
తనకు ప్రధాని మోడీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసరడాన్ని గౌరవంగా భావిస్తున్నాని…తన ఆరోగ్యంపై మోడీ శ్రద్ధ తీసుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్టర్‌లో కుమారస్వామి పోస్టు చేయగా తాజాగా మాజీ ప్రధాని దేవేగౌడ స్పందించారు.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని..1980ల నుంచే వ్యాయామం చేయడం మొదలు పెట్టానని తెలిపారు దేవెగౌడ. వ్యాయామం తన దైనందిన జీవితంలో ముఖ్యభాగమై పోయిందని అన్నారు. మితాహారం తీసుకుంటానని, మద్యం, ధూమపానం అలవాట్లు లేవని చెప్పారు. తాను శాకాహారినని,ఎలాంటి ఒత్తిళ్లు పెట్టుకోనని అన్నారు.