దేవకన్యలా మెరిసినా కాసులు కురిపించగలదా?

47
- Advertisement -

సమంత మైథాలాజికల్‌ మూవీ ‘శాకుంతలం’ నుంచి రిలీజ్ అయిన మల్లికా మల్లికా వీడియో సాంగ్‌ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పైగా ఈ పాటకు భారీ సంఖ్యలో లైక్స్ వస్తుండటం విశేషం. దాంతో ప్రస్తుతం ఈ సాంగ్ బాగా వైరల్ గా మారింది. ఇక ఈ పాటను రిలీజ్ చేసే సందర్భంగా సమంత చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ సమంత ఏమని కామెంట్స్ చేసింది అంటే.. ఆమె మాటల్లోనే విందాం. ”నేను ఆల్ రెడీ శాకుంతలం సినిమా చూశాను. సినిమా అత్యంత అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా నన్ను నేను కొత్తగా చూసుకున్నాను. సినిమా చూసిన క్షణం నుంచి ఈ సినిమాలోని వీడియో సాంగ్స్ ను కూడా విడుదల చేసేద్దామా అన్నంత ఆత్రుతగా ఉంది. ఆ విషయాన్నే గుణశేఖర్‌గారితో పంచుకున్నాను. ఆయన ఒప్పుకున్నారు అంటూ సామ్ చెప్పుకొచ్చింది.

ఐతే, శాకుంతలం సినిమాలో తనకు అత్యంత ఇష్టమైన పాట మల్లికా మల్లికా పాట అని, ఈ పాటను వీడియోలో చూడటం చాలా ఆనందకరమైన విషయం అని, ప్రజలందరికీ ఇప్పుడు మల్లికా మల్లికా వీడియో సాంగ్‌ బాగా నచ్చుతుంది అని సమంత చెప్పుకొచ్చింది. నిజంగానే సమంత చెప్పినట్టు ఈ పాట అందరికి నచ్చుతుంది. కాకపోతే.. ఈ పాటలోని విజువల్స్ ముఖ్యంగా విఎఫ్ఎక్స్ విజువల్స్ గుడ్ క్వాలిటీగా అనిపించడం లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, అవతార్ లాంటి సినిమాలు చూడటం అలవాటు చేసుకున్న తెలుగు ప్రేక్షకులకు శాకుంతలం విజువల్స్ ఎంతవరకు కనెక్ట్ అవుతాయి ? అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది.

సినిమాలో ససమంత లుక్ అయితే చాలా బాగుంది. సమంత మహారాణి లుక్ లో అచ్చం దేవకన్యలా మెరిసిపోతోంది. పైగా ఈ సినిమా కోసం సమంత నాలుగు కేజీలు బరువు ఉన్న ఆభరణాలను కూడా దరించింది. తళుకుబెళుకుల చీరలో దివి నుండి దిగివచ్చిన దేవకన్యలా సమంత కనిపించినా.. మరి సామ్ భారీ స్థాయిలో కాసులు కురిపించగలదా ? అనేది డౌటే.

ఇవి కూడా చదవండి…

Dasara:దసరాపై సూపర్‌స్టార్ కామెంట్ ఎంటంటే..!

NBK108:ఈసారి దసరాకి బాలయ్య

దాస్ కు ధమ్కీ ఇచ్చిన నాని

- Advertisement -