రాష్ట్రంలోని విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు అందించారు. తెలంగాణరాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి విజయం విద్యుత్ రంగంలోనేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రగతి భవన్‌లో విద్యుత్ ఉద్యోగులతో సమావేశమైన సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. విద్యుత్ ఉద్యోగులకు 35శాతం వేతన సవరణ ప్రకటించారు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసి మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. విద్యుత్‌ను పొరుగు రాష్ర్టాలకు అమ్ముకునే స్థాయికి ఎదగాలన్నారు సీఎం.
ఇప్పటికే రూ. 250 కోట్ల విలువైన విద్యుత్‌ను విక్రయించామని తెలిపారు. విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ అనేది కేంద్రం పరిధిలో ఉందన్నారు. వివాదంలో ఉన్న సీపీఎస్‌ను కూడా పరిష్కరించే దిశగా చర్చిస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. నా వరకు వచ్చిన సమస్యలను గతంలోనే పరిష్కరించాను… జేఎల్‌ఎంలకు సంబంధించిన కేసు కోర్టులో ఉంది. కేసు విత్‌డ్రా చేసుకుంటే మిగిలిన 600 మందిని కూడా నియమించుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే హెల్త్ స్కీమ్‌ను విద్యుత్ కార్మికులకు కూడా వర్తింప జేస్తాం. కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే నాణ్యమైన విద్యుత్ వస్తుంది అని సీఎం తెలిపారు.
భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి సాధ్యం కాని విదంగా నిరంతర విద్యుత్ అందిస్తున్నాం. పరిశ్రమలతో పాటు రైతులకు 24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. లక్షకోట్లతో ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతున్నాం. మనం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు కూడా విద్యుత్ మీద ఆధారపడినవే. తెలగాణ ఏర్పడితే చీకటి అవుతుందని కొందరు శాపనార్థాలు పెట్టారు.. వాళ్ల అంచనాలు తప్పని నిరూపించడంలో విద్యుత్ ఉద్యోగులది కీలక పాత్ర. తెలంగాణ చీకటి అవుతుందన్నవారే చీకట్లో కలిసిపోయారు. అనారోగ్యం బారిన పడిన విద్యుత్ ఉద్యోగులను తప్పకుండా ఆదుకుంటాం.
50వేల మందిలో 6వేల మందికి జీపీఎఫ్ సమస్య ఉంది. జీపీఎఫ్ అనేది కేంద్రం పరిధిలో ఉంది. వివాదంలో ఉన్న సీపీఎస్‌ను కూడా పరిష్కరించే దిశగా చర్చిస్తున్నాం’’ అని సీఎం కేసీఆర్‌వెల్లడించారు. అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడితే చీకటి అవుతుందని కొందరు శాపనార్థాలు పెట్టారు. తెలంగాణ చీకటి అయితదని చెప్పిన వారే చీకట్లో కలిశారని పేర్కొన్నారు. వాళ్ల అంచనాలు తప్పని నిరూపించడంలో విద్యుత్ ఉద్యోగులది కీలకపాత్ర అని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే బాలారిష్టాలు అధిగమించామని పేర్కొన్నారు.