దేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ప్రత్యేక ప్రతిష్టత ఉంది…సెంట్రల్ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం దమనకాండ తెలంగాణకి మాయనిమచ్చగా ఉందన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన దేశపతి.. తెలంగాణ మొదటి దశ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడింది అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా అనేక పోరాటాలు జరిగాయి అన్నారు.
భూదందాల నుండి వచ్చిన నాయకుడు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు.. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భూదందా చేస్తున్నారు, రేవంత్ రెడ్డికి సెంట్రల్ యూనివర్సిటీలో లంకె బిందెలు కనపడుతున్నాయి… సెంట్రల్ యూనివర్సిటీ భూముల ద్వారా 30 వేల కోట్ల రూపాయలు దండుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు అన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి రాష్ట్రపతి ఛాన్సలర్ గా వుంటారు.. సెంట్రల్ యూనివర్సిటీ లోపలకు పోలీసులు వెళ్లాలంటే వీసీ పర్మిషన్ కావాలి, పోలీసులను వీసీ ఎట్లా అనుమతించారు చెప్పాలన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.. నిన్నటి వరకు మీతో తిరిగిన విద్యార్థులు పెయిడ్ బ్యాచ్ విద్యార్థులా…? పొంగులేటి, జాస్వామ్యం
ఏడవ గ్యారెంటీ అని చెప్పారు, రాహుల్ గాంధీ రోహిత్ వేముల కోసం సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం ఎస్కార్ట్ ఇచ్చింది.. ఇప్పుడు రాహుల్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీకి ఎందుకు రావడం లేదు చెప్పాలన్నారు.
విద్యార్థుల వీపులపై లాఠీ దెబ్బలు కొట్టడం రాజ్యాంగ బద్దం కాదు రాహుల్ గాంధీ.. విద్యార్థులు రేవంత్ రెడ్డిని నిలదీస్తుంటే సిగ్గు అనిపించడం లేదా…?, బిఆర్ఎస్ హయాంలో నోరు విప్పిన మేధావులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారు…?, కోదండరాం,ఆకునూరి మురళి నిరంతరం ప్రతిపక్షం అన్నారు, ఎందుకు మౌన మునుల్లా మారిపోయారు, మూసీ,హైడ్రా పేరుతో ఇళ్ళు కూలగొడుతుంటే కోదండరాం ఎందుకు మాట్లాడలేదు చెప్పాలన్నారు. కోదండరాం ప్రజాస్వామిక స్ఫూర్తిని ఎందుకు మర్చిపోయారు.. చరిత్రలో దోషులుగా నిలబడే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు, లగచర్లలో గిరిజనుల భూములను లాక్కుంటే ఎందుకు మాట్లాడలేదు,కేసీఆర్ కు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు ఊపిరి ఆడిందా,రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడనందుకు ఊపిరి ఆడుతుందా చెప్పాలన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధిస్తే కోదండరామ్ ఎందుకు మాట్లాడలేదు, ఆకునూరి మురళికి సెంట్రల్ యూనివర్సిటీలో దళిత,బహుజన విద్యార్థులపై లాఠీ ఛార్జ్ కనపడటం లేదా, మేధావులు మాట్లాడాలని,కొట్లాడాలని సమాజం ఆశిస్తోంది.. మీకు కేసీఆర్ పై వ్యక్తిగత కోపమా…? లేక సమాజం పట్ల భాద్యత ఉందా లేదా అనేది తేల్చుకోవాలి అన్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్.ఎస్.యూ.ఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టర్లు వేసింది.. ప్రొఫెసర్ హరగోపాల్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రభుత్వం చర్యలను ఖండించారు అని గుర్తు చేశారు.
Also Read:HCU ఘటనపై రాజ్యసభలో సురేష్ రెడ్డి

