డేరా బాబాకు మళ్లీ పెరోల్‌

2
- Advertisement -

డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్‌ రహీమ్ సింగ్ (డేరా బాబా) మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. ఆయనకు హర్యానా జైళ్ల శాఖ 21 రోజుల పెరోల్‌ను మంజూరు చేసింది. ఇద్దరు మహిళా అనుచరులపై లైంగికదాడి (రేప్) కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్‌ రహీమ్‌కు ఈ విధంగా పెరోల్‌ లభించడం 2017లో శిక్ష పడిన తర్వాత ఇది 17వ సారి కావడం గమనార్హం.

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్న రామ్‌ రహీమ్, ఈ పెరోల్ కాలంలో సిర్సాలోని డేరా సచ్చా సౌదా ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌తో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ ఆయనకు భారీగా అనుచరులు మరియు భక్తులు ఉన్నారు.

Also Read:UPI డిజిటల్ పేమెంట్స్@10

రేప్ కేసులలో 20 ఏళ్ల జైలు శిక్ష పడటంతో పాటు, జర్నలిస్టు రామ్‌ చంద్ర ఛత్రపతి హత్య కేసులో కూడా రామ్‌ రహీమ్‌కు శిక్ష పడింది. అయితే ఈ జర్నలిస్టు హత్య కేసులో పంజాబ్-హర్యానా హైకోర్టు గతేడాది మార్చిలో రామ్‌ రహీమ్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ ఊరటనిచ్చింది.మరోవైపు, పదే పదే ఆయనకు పెరోల్ మంజూరు చేయడంపై సామాజిక వర్గాలలో మరియు విపక్షాలలో నిరసనలు, చర్చలు వ్యక్తమవుతున్నప్పటికీ, జైలు నిబంధనల ప్రకారమే పెరోల్స్ ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

- Advertisement -