ఇన్ని రోజులు లగ్జరీ లైఫ్ గడిపిన డేరా బాబా రామ్ రహీమ్ సింగ్ గుర్మీత్ ఇప్పుడు ఒక్కసారిగా లేబర్ అవతారమెత్తేశాడు. జైల్లో ఊచలు లెక్కబెడుతున్న డేరాబాబా ఇప్పడు అందరు ఖైదీల్లాగానే జైల్లో కూలి పని చేస్తున్నారు.
ప్రస్తుతం ఆయన రోహ్ తక్ జైల్లో ఉన్నారు. ఆయన చేస్తున్న పనికి గాను రోజుకు రూ. 20 కూలి ఇస్తున్నారు. అన్ స్కిల్డ్ లేబర్ గా, డైలీ లేబర్ గా డేరా బాబా పని చేస్తున్నారు.
ప్రతి రోజు ఆయన మట్టి పని చేస్తున్నారు. రోజుకు 4 నుంచి 5 గంటల సేపు పని చేస్తున్నారు. అందరి ఖైదీల్లాగానే ఆయనకూ అదే ఆహారాన్ని అందిస్తున్నారు. వార్తాపత్రికలు, టీవీని కూడా ఏర్పాటు చేయలేదు. ముఖ్యంగా హనీప్రీత్ కు సంబంధించిన సమాచారం ఆయనకు అందడం లేదు.
దీంతో రాత్రిపూట కూడా ఆమెనే కలవరిస్తున్నాడట. అయితే…ఇటీవలే ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం డేరా బాబాకు కోర్టు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించిన సంగతి తెలింసిందే.