మహిళా క్రికెటర్ గా సమంత…

335
Samantha in Mithali Raj Biopic
- Advertisement -

బాలీవుడ్‌లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతున్నవిషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు మరో బయోపిక్‌ రాబోతోంది. మహిళా క్రికెట్ లో 6వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక మహిళా క్రికెటర్ గా వెలుగొందుతున్న మిథాలీ రాజ్ బయోపిక్ కి శ్రీకారం చుట్టింది వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ.

ఇప్పటికే ఈ సంస్థ బాలీవుడ్ లో మేరీకోమ్ జీవితాన్ని ప్రియాంక చోప్రా హీరోయిన్ గా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టింది.

  Samantha in Mithali Raj Biopic

అయితే తాజాగా ఈ చిత్రంలో నటి సమంత రీల్‌ లైఫ్‌ మిథాలీ రాజ్‌గా నటించనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం. మిథాలీ రాజ్‌ పాత్ర కోసం వయాకామ్‌ సంస్థ సమంతతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే అక్టోబర్‌ 6న సమంత.. నాగచైతన్యల వివాహం జరగనుంది. దాంతో ఈ సినిమాకు ఒప్పుకుందా లేదా అన్న విషయమై స్పష్టత లేదు.

అదీకాకుండా ప్రస్తుతం సమంత ‘రంగస్థలం’, ‘మహానటి’ చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె కీలక పాత్రలో నటిస్తున్న ‘రాజుగారి గది 2’ చిత్ర షూటింగ్‌ ఇటీవల పూర్తైంది. మరి సమంత మిథాలీ రాజ్‌ బయోపిక్‌లో నటిస్తుందా లేదా అన్నది తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

- Advertisement -