బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు..

194
Bathukamma celebrations

జూబ్లీహిల్స్‌లోని బోరాబండ డివిజన్‌లో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ వేడుకకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. బతుకమ్మ ఆడటానికి వచ్చిన మహిళలకు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ ప్రత్యేకంగా మాస్కులు ఏర్పాటు చేసి స్వయంగా పంపిణీ చేశారు.

తెలంగాణ ప్రభుత్వం అడబిడ్డలకు అండగా ఉంటూ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తూ,పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నదని.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి బోరాబండ డివిజన్‌లో అన్ని పండుగలను పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నామని డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ తెలిపారు.