వరద బాధితులకు అండగా నిలిచిన బాలయ్య..

236
balakrishna
- Advertisement -

మూడు రోజుల వ్యవధిలో రెండు సార్లు భారీ వర్షాలు కురవడంతో హైదరాబాద్ మహానగరం ప్రస్తుతం విలయంలో చిక్కుకుపోయింది.. నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగి దయనీయ పరిస్థితికి చేరాయి. చెరువులను తలపిస్తోన్న లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు నీట మనిగాయి. జీహెచ్ఎంసీ, పోలీస్, విపత్తు నిర్వహణ శాఖలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, ఆహారం, మందులు అందిస్తున్నాయి.

ఈ క్రమంలోనే నటుడు నందమూరి బాలకృష్ణ హైదరాబాద్ వరదబాధితులకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. తనవంతుగా హైదరాబాద్ వరద బాధితులకు కోటిన్నర రూపాయలు విరాళం ప్రకటించాడు. అదే విధంగా పాతబస్తీలో బసవతారకరామా సేవసమితి ఆధ్వర్యంలో 1000 కుటుంబలకు బిర్యానీ ఏర్పాటు చేసి వాళ్లకు పంపించారు. అంతేకాదు ఇంకా ఏదైనా అవసరం కావాలన్నా కూడా తాను ముందుంటానని బాలయ్య హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళం అందించిన తొలి హీరో ఈయనే కావడం గమనార్హం. దాంతో పాటు ఇటీవల రోడ్డు పక్కనున్న నివాసాలు పూర్తిగా వర్షపు నీరుతో కొట్టుకుపోయిన వాళ్లకి అండగా నిలిచాడు ఈ నందమూరి నట సింహం.

- Advertisement -