ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం..

60
KKR

దుబాయ్‌లో జరిగిన ఐపీఎల్‌-13 సీజన్‌లో ఆదివారం మరో ఉత్కంఠబరిత మ్యాచ్‌ జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఛేదనలో డేవిడ్‌ వార్నర్‌ అద్భుత ఆటతీరుతో పోరాడినా చివరకు హైదరాబాద్‌ జట్టుకు దురదృష్టం వెంటాడడంతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సరిగ్గా 163 పరుగులే చేసింది.

దీంతో మ‌్యాచ్ టై అవ్యడంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. ఇందులో మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన కోల్‌కతా అద్భుత విజయాన్నందుకుంది. కోల్ కతా తరఫున దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ సూపర్ ఓవర్ ఆడారు. సన్ రైజర్స్ తరఫున రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. అయితే ఎంత ప్రయత్నించినా కోల్ కతా విజయాన్ని అడ్డుకోలేకపోయాడు.