ఓ వైపు కోహ్లీపై ఆసీస్ ఆటగాళ్లు మండిపడుతుంటే మరోవైపు ఆసీస్ దిగ్గజ పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీ ప్రశంసలు గుప్పించారు. కోహ్లీ వ్యూహాలు,బుమ్రా బౌలింగ్ అంటే ఇష్టమని తెలిపారు.
కోహ్లీ గొప్ప ఆటగాడని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రపంచ బ్యాట్స్‌మెన్లలో మేటిగా కోహ్లీ నిలిచాడని అంత మంచి ఆటగాడి స్వభావం కూడా బాగానే ఉంటుదని అనుకుంటున్నానని తెలిపారు లిల్లీ. సారథిగా దూకుడు అవసరమని మ్యాచ్‌లో అతడు అనుసరించే వ్యూహాలు ఎంతో బాగుంటాయని చెప్పారు. నేను చూసిన ఆటగాళ్లలో కోహ్లీ చాలా మంచి క్రికెటర్... ఎటువంటి బౌలింగ్‌నైనా అతడు సమర్థంగా ఎదుర్కోగలడని కితాబిచ్చారు.
ఇక బుమ్రాపై ప్రశంసలు గుప్పించారు డెన్నిస్ లిల్లీ. బుమ్రాకి ఆట మీద ఎంతో ఆసక్తి ఉంటుందని… అతడు తన బౌలింగ్‌తో కనికట్టు చేయగలడని తెలిపాడు. బుమ్రా బౌలింగ్ మాటలకు అందనిదని… బుమ్రాను చూసినప్పుడు నన్ను నేను చూసుకుంటున్నట్లు అనిపిస్తుందన్నారు. కోహ్లీ ప్రవర్తనపై ఆసీస్ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ డెన్నిస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.