‘క్యాష్ క్యాష్’మూవీ లోని సాంగ్ విడుదలచేసిన దర్శకుడు ‘బాబీ’

219
cash cash
- Advertisement -

తమిళంలో ‘థట్రోమ్ థూక్రోమ్’ పేరుతో రూపొందుతున్న చిత్రమ్ ‘క్యాష్ క్యాష్’ పేరుతో తెలుగులో విడుదల కాబోతుంది. మీడియా మార్షల్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాకు అరుళ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మొదటి సింగిల్ ‘డిమోనిటైజెషన్ సాంగ్’ ను దర్శకుడు బాబీ ఈ రోజు విడుదల చేసారు.

ఈ సందర్భంగా దర్శకుడు అరుళ్ కుమార్ మాట్లాడుతూ “ఈ పాట తమిళంలో ఒక ఉద్రేకంతో జనంలోకి వెళ్ళింది. అలాగే తెలుగు ప్రేక్షకులను ఈ పాట అలాగే ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను. ఈ పాటను లాంచ్ చేసినందుకు స్టార్ డైరెక్టర్ బాబీగారికి నా ధన్యవాదాలు” అని అన్నారు.

అనంతరం దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ఈ పాట వినగానే నోట్ల రద్దు సమయంలో ఎదుర్కొన్న కొన్ని వాస్తవిక పరిస్థితులను గుర్తుకు తెచ్చింది. అలాగే ప్రజలు ఎదుర్కొన్న సమస్యల ఆధారంగా ఈ సినిమాను చిత్రీకరించిన పద్ధతి నన్ను చాలా బాగా ఆకర్షించింది. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తెలిపారు.

- Advertisement -