నయా లుక్‌లో పూరి మార్క్‌ రామ్‌..

675
ram ismart shankar
- Advertisement -

2006లో వైవీఎస్ చౌదరి రూపొందించిన ‘దేవదాసు’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన హీరో రామ్‌. తర్వాత వైవిధ్యమైన సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్‌ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో రామ్‌ని వైవిధ్యమైన లుక్‌లో కనిపించనున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు పూరి మార్క్‌ హీరో. పూరి సినిమాలో హీరోగా నటించాలంటే ఎనర్జిటిక్‌గా ఉండాల్సిందే. ఇందుకు తగ్గట్టుగానే సినిమాలో రామ్‌ లుక్ అందరిని ఆకట్టుకుంటోంది.

రామ్ ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా చూపిస్తున్నారట. ఇందుకోసం రామ్ లైఫ్ స్టైల్ ను గెటప్ ను పూర్తిగా చేంజ్ చేశాడు. బాడీని వి షేప్ కు తీసుకొచ్చాడు. రామ్ వి షేప్ బాడీ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

యాక్షన్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్ తోట సినిమాటోగ్రఫీ అందిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ నిర్మాణ సంస్థలపై పూరీ , ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -