వ్యాక్సిన్ కంటే ఆల్కాహాలే ముద్దు!

127
covid 19
- Advertisement -

అవును మీరు చదివింది నిజమే….వ్యాక్సిన్ కంటే ఆల్కాహాలే ముద్దంటోంది ఓ బామ్మ. దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేసుల సంఖ్య రికార్డు స్ధాయిలో నమోదవుతుండగా నేటి నుండి ఆరు రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేజ్రీవాల్.

దీంతో ముందుబాబులు వైన్స్ షాపుల ముందు బారులు తీరారు. ఆడ,మగ తేడా లేకుండా వైన్స్ ముందు క్యూ కట్టగా వీరిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ నేపథ్యంలో లాక్ డౌన్ నుండి వైన్స్ షాపులకు మినహాయింపు ఇవ్వాలని ఓ మహిళ చేసిన సూచన అందరికీ నవ్వు తెప్పించింది. వ్యాక్సిన్ కంటే ఆల్కాహాల్ మంచిదని… ఇంజక్షన్ వల్ల ఉపయోగం లేదంటోంది. ఎంత తాగితే అంత బావుంటారని, కనీసం మందుషాపులైనా తెరిచి ఉంచాలని విజ్ఞప్తి చేసింది.

ఢిల్లీలో 2021, ఏప్రిల్ 19వ తేదీ సోమవారం రాత్రి 10 గంటల నుంచి 2021, ఏప్రిల్ 26వ తేదీ సోమవారం ఉదయం 5 గంటలవరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు కేజ్రీవాల్. ఢిల్లీలో కరోనా నాలుగో వేవ్ కొనసాగుతోండగా ఆక్సీజన్ కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకున్నాయి. దీంతో లాక్ డౌన్ విధించారు కేజ్రీవాల్.

- Advertisement -