గ్రేటర్ వరంగల్‌లో ప్రతిపక్షాల పనైపోయింది: సత్యవతి

39
sathyavathi

గ్రేటర్ వరంగల్‌ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌దే గెలుపని…ఇతర పార్టీల పనైపోయిందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. వరంగల్‌లో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మాట్లాడిన సత్యవతి…. అధికార పార్టీ నేతలే ఒకరికి ఒకరు పోటీ పడి వారి పరిధిలో మెజారిటీ సాధించాలన్నారు.

వచ్చే పది రోజులు అన్ని పనులు పక్కన పెట్టి ఎన్నికల కోసం మనం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ అంటే సిఎం కేసీఆర్‌, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేకమైన అభిమానం ఉందన్నారు. అందుకే బడ్జెట్‌లో ఈ నగరానికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు.

ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, జడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఇతర నేతలు పాల్గొన్నారు.