IPL 2023 : డిల్లీ vs గుజరాత్.. డిల్లీకి అదే మైనస్!

34
- Advertisement -

నేటి ఐపీఎల్ మ్యాచ్ లో డిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. డిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7;30 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు కూడా ఇప్పటికే చెరో మ్యాచ్ ను పూర్తి చేసుకున్నాయి. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై డీపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ ఘన విజయం సాధించగా, అటు లక్నో సూపర్ జెయింట్స్ పై డిల్లీ క్యాపిటల్స్ ఓటమి చవి చూసింది. దీంతో మరో విజయం కోసం గుజరాత్ తహతహలాడుతుంటే.. ఈసారైనా గెలిచి బోణి కొట్టాలని డిల్లీ భావిస్తుంది. ఇక ఈ రెండు జట్ల బలాబలాల విషయానికొస్తే.. గుజరాత్ తో పోలిస్తే డిల్లీ కాస్త బలహీనంగానే ఉందని చెప్పాలి. ముఖ్యంగా బ్యాటింగ్ లైనప్ జట్టును కలవరపెడుతున్న అంశం. పృధ్వీ షా, మార్ష్ వంటి బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికి మొదటి మ్యాచ్ లో విఫలం అవ్వడం కాస్త కలవరపెట్టే అంశం..

దాంతో బ్యాటింగ్ భారం అంతా డేవిడ్ వార్నర్ పైనే పడుతోంది. ముఖ్యంగా ఆ జట్టులో రిషబ్ పంత్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. కాగా ఇక బౌలింగ్ విభాగంలో ఖలీల్ చేతన్, సకరియా, అక్షర్.. వంటి వాళ్ళు పరవలేదనిపిస్తున్నప్పటికి ఇంకా మెరుగుపడాలి. అయితే ఆ జట్టుకు సానుకూలాంశం ఏమిటంటే.. సౌతాఫ్రికా ప్లేయర్స్ నేటి మ్యాచ్ తో ఐపిఎల్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. దీంతో రోసో, ఎంగిడి, నోర్జే వంటి ప్లేయర్స్ రాకతో డిల్లీకి బలం పెరిగిందనే చెప్పాలి. మరోవైపు కెన్ విలియమ్సన్ జట్టు నుంచి గాయం కారణంగా నిష్క్రమించినప్పటికి విధ్వంసకర బ్యాట్స్ మెన్ డేవిడ్ మిల్లర్ రాకతో గుజారత్ టైటాన్స్ జట్టు మరింత పటిష్టంగా మారింది. ఇక ఈ రెండు జట్ల గణాంకాలు పరిశీలిస్తే.. గుజారత్ జట్టుదే పై చేయి గా ఉంది. 2022లో జరిగిన ఐపీఎల్ తొలి మ్యాచ్ లో డిల్లీని ఓడించింది గుజరాత్ జట్టు. మరి ఈ రెండు జట్ల మద్య నేడు జరుగుతున్నా ఆసక్తికరమైన పోరులో ఏ జట్టు పై చేయి సాధిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి…

IPL 2023: ముంబై చెత్త రికార్డు

TWITTER:పిట్టను మార్చిన మస్క్‌..!

SUMMER:ఈసారి సమ్మర్‌.. అగ్ని కీలలే.!

- Advertisement -