ఢిల్లీ సచివాలయం ఫైల్స్ సీజ్..

3
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ విజయ ఢంకా మోగించింది. 27 ఏళ్ల నీరిక్షణకు తెరదించుతూ బీజేపీ ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుంది. మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 48, ఆప్‌ 22 స్థానాలను దక్కించుకోగా కాంగ్రెస్ పార్టీ వరుసగా మూడో ఎన్నికలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. తన కంచుకోట న్యూఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి పాలు అయ్యారు. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ సైతం ఓటమి పాలు కాగా ఆప్‌కు రిలీఫ్‌కు దక్కే విషయం సీఎం అతిశీ గెలుపొందడం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంతో ఎల్జీ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయాన్ని సీజ్‌ చేయాలని జీఏడీ ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా ఫైళ్లు, రికార్డులను తొలగించొద్దని ఆదేశాల్లో పేర్కొన్నారు.

బీజేపీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ప్రజాశక్తే అత్యున్నతమని, ఢిల్లీ ఓటర్లకు సెల్యూట్‌ అంటూ ట్వీట్‌ చేశారు. అభివృద్ధి, సుపరిపాలనలు విజయం సాధించాయన్నారు. ఢిల్లీ అభివృద్ధికి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ఇది తమ గ్యారంటీగా మోదీ వెల్లడించారు.

Also Red:ఢిల్లీ సీఎం రేసులో పర్వేశ్ వర్మ !

- Advertisement -