మరో వివాదంలో ట్విట్టర్..

292
Twitter
- Advertisement -

కొత్త ఐటీ విధానం విషయంలో కేంద్రంతో విభేదిస్తోన్న ట్విట్టర్ మరో వివాదంలో చిక్కుకుంది. ట్విట్టర్‌లో బాలల అశ్లీల కంటెంట్ (చైల్డ్ పోర్నోగ్రఫీ) ఉందంటూ ఎన్సీపీసీఆర్ (జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును స్వీకరించిన ఢిల్లీ సైబర్ పోలీసులు ట్విట్టర్‌పై కేసు నమోదు చేశారు. వాస్తవానికి ట్విట్టర్‌కు వ్యతిరేకంగా ఎన్సీపీసీఆర్ కొన్నిరోజుల కిందటే పలుమార్లు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ ఢిల్లీ సైబర్ పోలీసులు స్పందించకపోవడంతో ఎన్సీపీసీఆర్ తాజాగా సమన్లు పంపింది. ఈ నేపథ్యంలో,ట్విట్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఢిల్లీ సైబర్ సెల్ డీసీపీ అన్యేష్ రాయ్ వెల్లడించారు.

- Advertisement -