ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతం దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి కేంద్రంగా మారింది. ఇక మత ప్రార్ధనల్లో పాల్గోన్న చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిజాముద్దీన్ మర్కజ్‌లో మర్చ్ 1 నుంచి 15వ తేదీ మధ్య మతపరమైన కార్యక్రమం జరిగింది. విదేశీయులతోపాటు వివిధ రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో దీనికి హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న 24 మందికి కరోనా సోకినట్లు ఢిల్లీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.
దీంతో నిజాముద్దీన్ మార్కజ్ ప్రాంతాన్ని శానిటైజేషన్ చేశారు ఢిల్లీ మున్సిపల్ అధికారులు.నిజాముద్దీన్ దర్గా షరీఫ్ సహా చుట్టు పక్కల ప్రాంతాలను శానిటైజేషన్ చేశారు. శానిటైజేషన్ అనంతరం ప్రాంతాన్ని సందర్శించా రు ఢిల్లీ ఆరోగ్యశాఖ అధికారులు.36 గంటల ఆపరేషన్ లో నిజముద్దీన్ మార్కజ్ ప్రాంతం నుంచి 2,361 మందిని తరలించారు అధికారులు. 617 మందిని ఆస్పత్రిలో చేర్పించి.. మిగిలిన వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించారు. తరలించిన వారి జాబితాను అన్ని విభాగాలకు అందించారు ఢిల్లీ పోలీసులు.