నోబాల్‌ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే..!

450
no ball
- Advertisement -

నోబాల్‌పై ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ గుర్తించడంలో ఫీల్డ్‌ అంపైర్లు విఫలమవుతుండటంతో బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను థర్డ్‌ అంపైర్‌ చూస్తారని తెలిపింది. ఈ నెల 21 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమయ్యే మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ను థర్డ్‌ అంపైర్‌ పర్యవేక్షిస్తాడని ఐసీసీ తెలిపింది.

భారత్, వెస్టిండీస్‌ల్లో జరిగిన 12 మ్యాచ్‌ల్లో థర్డ్‌ అంపైర్‌కు ప్రయోగాత్మకంగా ఈ బాధ్యతలను అప్పగించి ఐసీసీ పరిశీలించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. మహిళల టీ20 వేదికగా తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

ఇక ఐపీఎల్ 2020లో సైతం నోబాల్ కోసం ప్రత్యేక అంపైర్‌ని పెట్టాలనే నిర్ణయం తీసుకుంది. బ్రిజేశ్‌‌ పటేల్‌‌ నేతృత్వంలో ఇటీవల జరిగిన కౌన్సిల్‌‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

- Advertisement -