CJP:కేంద్రంకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు

3
- Advertisement -

దేశ భద్రత కారణాలను చూపుతూ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (గతంలో ట్విట్టర్)లో తన ఖాతాను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం,X సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది.

తన ట్విట్టర్ ఖాతాను వెంటనే పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ అభిజిత్ దిప్కే కోర్టును అభ్యర్థించారు. అయితే దీనిపై తక్షణ ఆదేశాలు జారీ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశం కాబట్టి, కేవలం ఒకరి వాదనలు విని నిర్ణయం తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తరపున ఉన్న వివరణను, వారి వాదనలను కూడా తాము వినాల్సి ఉంటుందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖను, ఎక్స్ యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇరు పక్షాలు రాబోయే జూలై 6వ తేదీ లోపు తమ వివరణను కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఆ తేదీకి వాయిదా వేసింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకు సోషల్ మీడియా ఖాతాల నిలిపివేతపై గతంలోనూ పలు వివాదాలు రేగిన నేపథ్యంలో, దేశ భద్రత మరియు వ్యక్తిగత భావప్రకటనా స్వేచ్ఛ మధ్య సమతుల్యతను కోరే ఈ కేసుపై జూలై 6న జరిగే విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read:‘ఇట్లు అర్జున’..ఫస్ట్ సింగిల్

- Advertisement -