ఆందోళనలను విస్మరించలేం…సోనం వాంగ్‌చుక్‌ను మెదాంతా ఆస్పత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ప్రతిపాదించింది. ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్‌ను మెదాంతా ఆస్పత్రికి తరలించాలని ప్రతిపాదించింది.
వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై వ్యక్తమైన ఆందోళనలను నిర్లక్ష్యం చేయలేమని కోర్టు వ్యాఖ్యానించింది. ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి నుంచి మెదాంతా ఆస్పత్రికి తరలించే అంశాన్ని కోర్టు పరిశీలించింది. ప్రస్తుతం సోనం వాంగ్‌చుక్ సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
తనకు నచ్చిన ప్రైవేట్ ఆస్పత్రికి మార్చాలని ఆయన కుటుంబం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.డివిజన్ బెంచ్ ఆ అభ్యర్థనను అంగీకరించి, వేదాంత హాస్పిటల్‌కు తరలించేందుకు అనుమతి ఇచ్చింది. రోగికి తనకు నచ్చిన వైద్యసంస్థలో చికిత్స పొందే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.అవసరమైన వైద్యపరమైన విధివిధానాలు పూర్తి చేసి, భద్రతా ఏర్పాట్ల మధ్య తరలింపును నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించింది.
Also Read:మొదటి డెంగ్యూ వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలి?

