- Advertisement -
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు సీజేఐ రమణ. తాజాగా గేని జడ్జిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ హైకోర్టు జడ్జిగా సీనియర్ లాయర్ సౌరభ్ కిర్‌పాల్ పేరు సిఫార్సు చేసింది. గత మూడేళ్లుగా సౌరభ్ కిర్‌పాల్ పై కొలీజియం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే సంచలన నిర్ణయాలకు కేరాఫ్‌గా మారిన రమణ… నేతృత్వంలోని కొలిజియం ఈ నిర్ణయం తీసుకుంది.
2017లో మొదటిసారి సౌరభ్ కిర్‌పాల్ పేరును సిఫార్సు చేసింది ఢిల్లీ హైకోర్టు. విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తిని, జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. గే తో సహజీవనం చేస్తున్న కారణంగా సౌరభ్ కిర్‌పాల్ పేరును పక్కన పెట్టింది కేంద్రం. సౌరభ్ కిర్‌పాల్ మాజీ సీజేఐ బీఎన్ కిర్‌పాల్ కుమారుడు.
- Advertisement -