పాఠశాలల్లో బ్యాగ్ విధానానికి కొత్త మార్గదర్శకాలు..

34
delhi

పాఠశాలల్లో బ్యాగ్ విధానానికి సంబంధించి ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. పాఠశాల బ్యాగ్ విధానం 2020 పేరుతో ఢిల్లీలోని పాఠశాలలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ప్రీ-ప్రైమరీ తరగతి చదువుతున్న పిల్లలు బ్యాగ్ లు తీసుకెళ్లవలసిన అవసరం లేదని తెలిపింది.

ప్రైమరీ, సెకండరీ, సీనియర్ సెకండరీ తరగతి విద్యార్థుల బ్యాగుల బరువును తగ్గించడానికి పాఠశాలలకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపింది. కొత్త సర్క్యులర్ ప్రకారం పాఠశాల బ్యాగ్ విధానం బరువు యొక్క చార్ట్ ను నోటీసు బోర్డులో, ప్రతి తరగతి గదిలో ఏర్పాటు చేయాలని పేర్కొంది.

విద్యార్థుల బ్యాగ్ ఎక్కువ బరువు ఉండకుండా పాఠశాలల సిబ్బంది తనిఖీ చేయాలని….బ్యాగ్స్ యొక్క రెండు బెల్టులను వేలాడదీయడానికి విద్యార్థులను ప్రోత్సహించే బాధ్యత కూడా పాఠశాలపై ఉంటుందని వెల్లడించింది. వాటర్ బాటిల్స్ తీసుకురాకుండా ఉండటానికి పాఠశాలలు విద్యార్థులకు తాగునీరు అందించాలని తెలిపింది.

కొత్త మార్గదర్శకాలతో, పాఠశాలలు SCERT, NCERT, CBSE సూచించిన పాఠ్యపుస్తకాలను మాత్రమే అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం పిల్లలకు అదనపు పుస్తకాలు లేదా అదనపు వస్తువులను తీసుకురావాలని సూచించవద్దని పేర్కొంది.

క్లాసుల వారిగా విద్యార్థుల బ్యాగ్ బరువు వివరాలు.

()ప్రీ-ప్రైమరీ – బ్యాగ్ ఉండదు

()1 మరియు 2 తరగతులకు 1.6 నుండి 2.2 కిలోలు

()3, 4, 5 తరగతులకు 1.7 నుండి 2.5 కిలోలు

()6, 7 తరగతులకు 2 నుండి 3 కిలోలు

()8 వ తరగతికి 2.5 నుండి 4 కిలోలు

()9, 10 తరగతులకు 2.5 నుండి 4.5 కిలోలు

()11,12 తరగతులకు 3.5 నుండి 5 కిలోలు మాత్రమే ఉండాలని ఉత్తర్వులు జారీచేసిన ఢిల్లీ ప్రభుత్వం.