బర్డ్ ప్లూ నివారణకు ప్రత్యేక కంట్రోల్ రూమ్..

46
bird flu

బర్డ్ ప్లూ నివారణకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఢిల్లీ,రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో మరోసారి బర్డ్ ఫ్లూ బయటకి రావడంతో ముందస్తు చర్యలకు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం.

బర్డ్ ఫ్లూ నివారణ చర్యలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేయడం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కేంద్ర పాడి పశు సంవర్థక మాంత్రిత్వ శాఖ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది కేంద్రం. అవకాశం ఉన్నంత మేరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచనలు చేసింది.