గ్యాంగ్ రేప్..టీవీ నటుడు అరెస్ట్!

6
- Advertisement -

ఢిల్లీ సివిల్ లైన్స్‌లో గ్యాంగ్‌రేప్ కేసులో టీవీ నటుడుని పుణెలో అరెస్ట్ చేశారు పోలీసులు. గత ఆగస్టులో ఢిల్లీ సివిల్ లైన్స్‌లో జరిగిన గ్యాంగ్‌రేప్ కేసులో ఒక టీవీ నటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. టీవీ నటుడు ఆశిష్ కపూర్‌ను పుణెలో అరెస్ట్ చేశాం అని ఉత్తర ఢిల్లీ డీసీపీ రాజా బంథియా తెలిపారు.

24 ఏళ్ల యువతి ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ, పంజాబీ బాగ్‌లో నివసిస్తోంది. ఆమె స్నేహితుడు ఒక పార్టీకి ఆహ్వానించాడు. ఆ పార్టీ సివిల్ లైన్స్‌లో మరో స్నేహితుడి ఇంట్లో జరిగింది. అక్కడికి వెళ్లినప్పుడు ఆమెతో పాటు మరో మహిళ సహా ఐదుగురు ఉన్నారని చెప్పింది.

పార్టీ సమయంలో నిందితులు పానీయంలో మత్తు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు స్పృహ తప్పి, గ్యాంగ్‌రేప్ జరిగిందని తెలిపింది. అంతేకాదు, ఆమెను కొట్టి, దాడి చేసి, ఈ దృశ్యాలను వీడియో తీయడమే కాకుండా, ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పితే ఆ వీడియోను ఆన్‌లైన్‌లో పెడతామని బెదిరించారని పేర్కొంది. దాడి అనంతరం నిందితులు ఆమెను ఇంటి బయట వదిలేసి పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read:TTD:భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు

- Advertisement -