క్రికెట్ మ్యాచుల టికెట్ రేట్లపై జీఎస్టీ 40 శాతానికి పెంచారు. గతంలో 28 శాతం జీఎస్టీ ట్యాక్స్ ఉండగా దీంతో ఐపీఎల్ అభిమానులపై జీఎస్టీ భారం పడనుంది. పెరిగిన జీఎస్టీతో రూ.1000 ఉండే మ్యాచ్ టికెట్ రేట్ రూ.1400 ఉండగా ఐపీఎల్ టికెట్లపై జీఎస్టీ 40%ని పెంచారు. దీంతో అభిమానులకు పెరిగింది.
ఐపీఎల్ మ్యాచ్‌లను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే క్రికెట్ అభిమానులకు ఇకపై మరింత ఖర్చు కానుంది. ప్రభుత్వం ఐపీఎల్ టికెట్లపై జీఎస్టీని 28% నుండి 40%కి పెంచింది. దీంతో ఐపీఎల్ టికెట్లు ఇప్పుడు కాసినోలు, లగ్జరీ వస్తువులతో సమానమైన అత్యధిక పన్ను స్లాబ్‌లోకి చేరాయి.
ఈ పెంపుతో టికెట్ ధరలు గణనీయంగా పెరిగాయి. రూ.1,000 విలువైన టికెట్, ఇంతకుముందు జీఎస్టీతో కలిపి రూ.1,280 కాగా, ఇప్పుడు రూ.1,400 అవుతుంది. రూ.500 టికెట్, రూ.640 నుంచి రూ.700కి పెరిగింది.రూ.2,000 టికెట్, రూ.2,560 నుండి రూ.2,800కి పెరిగింది. రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్టీని 12% నుండి 5%కి తగ్గించారు. రూ.100 పైబడిన టికెట్లకు మాత్రం 18% జీఎస్టీ కొనసాగుతుంది.
Also Read:TTD:భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు
ఐపీఎల్ అభిమానులకు ఇది కేవలం టికెట్ ధరల పెరుగుదలతో ఆగిపోకుండా, స్టేడియం ఛార్జీలు, ఆన్‌లైన్ బుకింగ్ ఫీజులు వంటి అదనపు ఖర్చులు కూడా భారమవుతాయి. దీంతో ప్రత్యక్షంగా ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించడం క్రికెట్ ప్రేక్షకులకు మరింత ఖరీదైన వ్యవహారమైంది.

