యమునా నది ఉగ్రరూపం..ఎర్రకోటలోకి చేరిన నీరు

64
- Advertisement -

భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ కకావికలమైంది. ఎడతెరపిలేని వర్షాలతో రోడ్లన్ని చెరువులను తలపిస్తుండగా తాజాగా ఢిల్లీ నగరానికి వరద ముప్పు తీవ్రమవుతోంది.యమునా నది ఉగ్రరూపం దాల్చడంతో ఐటీఓ, ఎర్ర కోట, ఢిల్లీ సచివాలయం జలమయమయ్యాయి.

మరికాసేపట్లోనే ఇండియా గేట్ కూడా వరద నీటితో నిండిపోతుందని అంచనా వేస్తున్నారు. యమునా నదిలో 508.51 మీటర్ల నీటి మట్టం ఉండటంతో ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ముందుజాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించగా అత్యవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రభుత్వం ఆదేశించింది.

ఢిల్లీ నగరంలో వర్షాలు అతిగా కురవలేదు, కానీ హిమాచల్ ప్రదేశ్ నుంచి వరద నీరు యమునా నదిలోకి వస్తోంది. దీంతో ఈ నదిలో నీటి మట్టం గురువారం గత కాలపు రికార్డులను అధిగమించి, ప్రమాద స్థాయిని దాటి 208.48 మీటర్లకు పెరిగింది. 45 ఏళ్ళ క్రితం 207.49 మీటర్ల నీటి మట్టం నమోదైంది.

హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి మరింత నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో పార్లమెంటు, సుప్రీంకోర్టు, ఇండియా గేట్ మునిగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ సచివాలయంలోని ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఆయన కేబినెట్ సహచరుల కార్యాలయాలు నీట మునిగాయి. రాజ్‌ఘాట్ నుంచి సచివాలయం వరకు ఉన్న రోడ్డు కూడా మునిగింది.

Also Read:స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వవైభవం:ఎర్రబెల్లి

- Advertisement -