దేశవ్యాప్తంగా రైతుల నిరాహారదీక్షలు..

213
farmers
- Advertisement -

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళన 19వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు వివిధ రూపాల్లో నిరసనలు తెలిపిన రైతులు ఇవాళ ఒక్కరోజు దీక్షకు పిలుపునివ్వగా దేశవ్యాప్తంగా అన్నిజిల్లా కేంద్రాలు,మండల కేంద్రాల్లో రైతులు దీక్షలు చేపట్టారు.

ఢిల్లీ సరిహదులైన టిక్రీ, సింఘులో రైతు సంఘాల నేతలు దీక్షను ప్రారంభించగా..అన్నదాతల ఒక్క రోజు దీక్షలో తానూ పాల్గొంటున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ కార్యకర్తలు కూడా స్వచ్ఛందంగా ఈ దీక్షల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఢిల్లీలో ఉద్యమానికి మద్దతుగా రైతులు భారీగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. రైతుల ఆందోళనపై కేంద్రమంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అవమానపరుస్తోందంటూ శివసేన, ఎన్సీపీతో పాటు పలు పార్టీలు ధ్వజమెత్తాయి.

- Advertisement -