రానా..విరాటపర్వం ఫస్ట్ లుక్‌

231
virataparvam
- Advertisement -

సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం విరాటప‌ర్వం . రానా సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోండగా రానా నక్సలైట్ పాత్రలో సాయి పల్లవి జర్నలిస్ట్‌గా నటిస్తోంది. ప్ర‌స్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఎస్‌.ఎల్‌.వి సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు నివేదా పెతురాజ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇవాళ రానా బర్త్ డే సంద‌ర్భంగా చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు. ఇందులో రానా చేతిలో గ‌న్‌తో న‌క్స‌లైట్ అవ‌తారంలో క‌నిపిస్తున్నారు. ఇందులో ర‌వి అన్న అనే న‌క్స‌లైట్ లీడ‌ర్‌గా రానా సంద‌డి చేయ‌నున్నాడు.

సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల్ని మేళవిస్తూ రూపొందిస్తున్నారు . ప్రియమణి, నందితాదాస్‌, నవీన్‌చంద్ర, జరీనా వహాబ్‌, ఈశ్వరీరావ్‌, సాయిచంద్‌, బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -