- Advertisement -
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన 14వ రోజుకు చేరాయి. హర్యానా – ఢిల్లీ సరిహద్దులోని సింఘు బోర్డర్ వద్ద రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు.
ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుండగా నిన్న మరోసారి కేంద్ర మంత్రి అమిత్ షా రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి డిమాండ్లపై చర్చించారు. సాగు చట్టాలను రద్దు చేయడం కుదరదని అమిత్ షా తేల్చిచెప్పారు. చట్టాల్లో కొన్ని సవరణలకు సముఖంగా ఉన్నామని షా స్పష్టం చేశారు.ఇక ఇవాళ సవరణల ప్రతిపాదనలను రైతులకు నేడు లిఖితపూర్వకంగా కేంద్రం అందించనుంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రులతో బుధవారం జరపాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.
- Advertisement -