ఢిల్లీలో మరో వారం పాటు లాక్‌డౌన్‌..

245
Delhi lockdown
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా కేసులు ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంత రాష్ట్రాలన్నీ నష్ట నివారణ చర్యలను చేపట్టాయి. ప్రజల ప్రాణాలను రక్షిస్తూనే, ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ, మరో వైపు ఎక్కడికక్కడ ఆంక్షలతో కరోనా కేసుల సంఖ్యను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే దేశ రాజధాని ఢిల్లీలో క‌రోనా కేసుల ఉద్ధృతి విప‌రీతంగా ఉన్న‌ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ వారం రోజుల క్రితం ఆరు రోజుల లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ లాక్‌డౌన్ సోమ‌వారం ఉద‌యం 6 గంట‌ల‌కు ముగియ‌నుంది. ఆ స‌మ‌యంలో ఆయ‌న‌ లాక్‌డౌన్‌ పొడిగింపు అవ‌కాశాలేవీ ఉండ‌బోవ‌ని చెప్పిన‌ప్ప‌టికీ.. ఆ ప‌ని చేయ‌క‌త‌ప్పలేదు. మరో వారం రోజులపాటు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్న‌ట్లు కేజ్రీవాల్ ఈ రోజు ప్రకటించారు.

వ‌చ్చేనెల 3వ తేదీ ఉదయం 5 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని చెప్పారు. క‌రోనా విజృంభ‌ణ ఉగ్ర‌రూపం దాల్చిన నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ విధించక‌పోతే రానున్న రోజుల్లో ప‌రిస్థితులు మ‌రింత చేజారిపోతాయ‌ని ఢిల్లీ ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌జ‌లు అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచిస్తోంది.

- Advertisement -