హైదరాబాద్‌కు కేజ్రీవాల్..సీఎం కేసీఆర్‌తో భేటీ

76
- Advertisement -

రేపు ఉదయం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలంగాణకు రానున్నారు. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై పోరాటానికి విపక్షాల మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు కేజ్రీవాల్.ఢిల్లీలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీ, పోస్టింగ్ లపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి మద్దతివ్వాలని కోరనున్నారు.

Also Read:సిద్దరామయ్యకు కలవరం.. బీజేపీ ప్లాన్ అదే !

ఈ ఆర్డినెన్స్‌ను పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకించాల‌ని విప‌క్షాల‌ను కేజ్రీవాల్ కోరుతున్నారు. ఈ విష‌య‌మై కేజ్రీవాల్ ఇప్ప‌టికే వెస్ట్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, మ‌హారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధ‌వ్ థాక‌రేల‌తో క‌లిసి చ‌ర్చించారు.ఇందులో భాగంగా తాజాగా తెలంగాణ సీఎంను కలవనున్నారు కేజ్రీవాల్.

Also Read:రాత్రి నిద్రకు ముందు ఇలా చేస్తే..

- Advertisement -