టాస్‌ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌..

52
dc

దుబాయ్ వేదికగా ఐపీఎల్‌-2020లో ఇవాళ రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సన్‌రైజర్స్‌ హైదాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. లీగ్‌ దశను టాప్‌-2తో ముగించాలనుకుంటున్నట్లు అయ్యర్‌ చెప్పాడు. గాయంతో గత కొన్ని మ్యాచ్‌లకు దూరమైన కేన్‌ విలియమ్సన్‌ మళ్లీ తుదిజట్టులోకి వచ్చాడు. బెయిర్‌ స్టో, ప్రియం గార్గ్‌, ఖలీల్‌ అహ్మద్‌ స్థానంలో విలియమ్సన్, వృద్ధిమాన్‌ సాహా, షాబాద్‌ నదీంలను జట్టులోకి తీసుకున్నట్లు హైదరాబాద్‌ సారథి వార్నర్‌ పేర్కొన్నాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడిన మ్యాచ్‌లో అనుహ్య ఓటమిని చవిచూసింది సన్‌రైజర్స్. దాదాపు ప్లే ఆఫ్ రేసులో నుంచి తప్పుకున్నప్పటికి.. ఇక లీగ్‌లో అదృష్టంపైనే జట్టు భవిష్యత్ అధారపడి ఉంది.ఆడబోయే మూడు మ్యాచ్‌లను హైదరాబాద్ ఖచ్చితంగా గెలవాలి. అంటే ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లను ఓడించాలి. అలాగే కోల్‌కతా, పంజాబ్ జట్లు తమ తదుపరి మ్యాచ్‌లు ఓడిపోయి.. హైదరాబాద్ మూడు మ్యాచ్‌లు గెలిస్తే.. వార్నర్ టీమ్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌: డేవిడ్ వార్నర్ (సి), కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, విజయ్ శంకర్, వృదిమాన్ సాహా (wc), జాసన్ హోల్డర్, అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్, షాబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టి నటరాజన్.

ఢిల్లీ: శిఖర్‌ ధావన్‌, రహానె, శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్), పంత్‌, హెట్‌మైయర్‌, స్టాయినిస్, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రబాడ, నోర్జె, తుషార్‌ దేశ్‌పాండే