సన్‌ రైజర్స్‌పై ఢిల్లీ కేపిటల్స్‌ ఘనవిజయం…

38
srh

ఐపీఎల్ 14వ సీజన్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఇంకా 8 వికెట్లు ఉండగానే 17.4 ఓవ‌ర్ల‌లో ల‌క్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ పృథ్వీ షా కేవలం 11 ప‌రుగుల‌కే ఔట్ అయిన‌ప్ప‌టికీ.. ఓపెన‌ర్ శిఖ‌ర్ ధ‌వ‌న్ (42), శ్రేయాస్ అయ్య‌ర్ (47), రిష‌బ్ పంత్ ( 35 ) రాణించారు. దీంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది ఢిల్లీ.

అంతకముందు టాస్‌గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్ వార్నర్ డకౌట్‌గా వెనుదిరుగగా సాహా (18 ), విలియ‌మ్స‌న్ (18), మ‌నీశ్ పాండే (17) , కేద‌ర్ జాద‌వ్(3) ప‌రుగుల‌కే వెనుదిరుగగా అబ్దుల్ స‌మ‌ద్ (28), ర‌షీద్ ఖాన్ (22) మాత్ర‌మే రాణించారు. దీంతో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కొల్పోయి 134 పరుగులు మాత్రమే చేసింది.