ఐపీఎల్ 2020…ఫైనల్లో ఢిల్లీ

101
dc

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 172 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ పరుగుల 17 తేడాతో విజయం సాధించింది.

190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ప్రియమ్ గార్గ్ 17,వార్నర్ 2,మనీశ్ పాండే 21 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టారు. జాసన్ హోల్డర్ 11 కేన్ విలియమ్సన్ ఒంటరి పోరాటం చేశాడు. 67 పరుగులు చేసి విలియమ్సన్ ఔటవడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. సమద్ 33,రషీద్ ఖాన్ 11 పరుగులు చేసి పర్వాలేదనిపించారు.

అంతకముందు టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌(78) రాణించడంతో ఢిల్లీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. మార్కస్‌ స్టాయినీస్‌(38), హెట్‌మైర్‌(42) ,శ్రేయాస్ అయ్యర్ (21) రాణించారు. దీంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది.