అనురాగ్ శర్మ పదవీకాలం పొడగింపు..

56
Anurag Sharma

అనురాగ్‌ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సలహాదారుగా ( పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ) కొనసాగుతున్న ఆయన పదవీ కాలాన్ని మూడేళ్లపాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12 నుంచి ఉత్తర్వులు అమలులోకి రానున్నట్లు వెల్లడించింది. ఆయన సేవలు ఇంకా రాష్ట్రానికి అవసరం ఉందని పేర్కొంది.

తెలంగాణ తొలి డీజీపీగా పని చేసిన ఆయన 2017లో పదివీ విరమణ పొందారు. నాటి నుంచి పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ సలహాదారుగా కొనసాగుతున్నారు.