రాజస్థాన్‌పై ఢిల్లీ గెలుపు

45
- Advertisement -

ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. 223 పరుగల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్..నిర్ణీత ఓవర్లలో 201 పరుగులు మాత్రమే చేసింది. సంజూ శాంసన్‌ 46 బంతుల్లో 6 సిక్స్‌లు,8 ఫోర్లతో 86 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలం కావడంతో రాజస్థాన్ ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. అభిషెక్‌ పొరెల్‌ 36 బంతుల్లో 3 సిక్స్‌లు 7 ఫోర్లతో 65, జేక్‌ ఫ్రేసర్‌ 20 బంతుల్లో 50 పరుగులు దాటిగా ఆడారు. ఇక చివరలో స్టబ్స్ 20 బంతుల్లో 41 పరుగులు చేయడంతో ఢిల్లీ భారీ స్కోరు సాధించింది. కుల్దీప్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

ప్లేఆఫ్స్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ అదరగొట్టింది. ఢిల్లీకి ఇది ఆరో విజయం కాగా 12 పాయింట్లతో పంత్‌ సేన పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి దూసుకొచ్చింది.

Also  Read:KCR:రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్

- Advertisement -