షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పిన దీప్తి

28
deepthi

యూ ట్యూబ్ స్టార్ షణ్ముఖ్‌కి బ్రేకప్ చెప్పింది దీప్తి సునయన. కొద్దిరోజులగా వీరిద్దరూ విడిపోనున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా దానిని అఫిషియల్‌గా కన్ఫామ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది దీప్తి.

చాలా ఆలోచించి, మాట్లాడుకున్న తర్వాత షణ్ముఖ్, నేను ఈ నిర్ణయం తీసుకున్నాం. పరస్పర అంగీకారంతో మేము విడిపోయి వ్యక్తిగతంగా జీవించాలనుకుంటున్నాం. ఇకపై ఎవరి దారిలో వాళ్ళు వెళ్దామని నిర్ణయించుకున్నాం అని వెల్లడించింది.

మేం ఇద్దరం కలిసి ఉన్న ఈ ఐదేళ్లలో చాలా హ్యాపీగా, ఎంతో అప్యాయంగా ఉన్నాం. కానీ మా మనసుల్లో ఉన్న రాక్షసులతో పోరాడటం చాలా కష్టం. మీరందరూ కోరుకున్నట్లే మేం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. బ్రేకప్ అనేది సోషల్ మీడియాలో కనిపించినంత ఈజీ కాదు. మా బ్రేకప్ చాలా కాలం కొనసాగుతూనే ఉందన్నారు. మీరు చూపించే ప్రేమకి, సపోర్ట్ కి ధన్యవాదాలు అని పోస్ట్ పెట్టింది.