కోడి రామకృష్ణ దర్శకత్వంలో అనుష్క హీరోయిన్‌గా 2009లో తెరకెక్కిచ చిత్రం అరుంధతి. లేడి ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసింది. అరుంధతి జేజమ్మగా అనుష్క,పశుపతిగా సోనుసూద్ అదరగొట్టారు.ఈ సినిమాకు ఉత్తమనటిగా అనుష్క,ఉత్తమ సహాయనటుడిగా సోనూసూద్ ఫిలిం ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. అనుష్క కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.
ఇక దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీమేక్ తెరకెక్కనుంది.ఈ సినిమా బాలీవుడ్ రైట్స్‌ని అల్లు అరవింద్ ఫ్యాన్సీ రేటుకు దక్కించుకోగా మధు మంతెనతో కలిసి తెరకెక్కించనున్నారు.
ఇక ఈ మూవీలో అనుష్క పాత్రలో దీపికా పదుకొణే నటించనుందని సమాచారం. ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ త్వరలో వచ్చే అవకాశం ఉండగా ఇప్పటికే దీపికా వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ప్రభాస్‌తో సినిమాలో నటించనుంది.