గ‌ల్లీ బాయ్‌కి ఐ లవ్‌ యూ చెప్పిన దీపికా..

225
- Advertisement -

టాలీవుడ్‌ టెంపర్ మూవీని హిందీలో సింబా పేరుతొ రీమేక్ చేసుకుని సూపర్ హిట్ అందుకున్నాడు రణ్‌వీర్ సింగ్. ప్రస్తుతం ఈ హీరో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. గతేడాది బాలీవుడ్‌లోని బడా స్టార్లందరూ డిజాస్టర్లతో బాక్స్ ఆఫీస్‌కు షాకివ్వగా.. రణ్‌వీర్‌ మాత్రం ఇయర్ ఎండింగ్‌లో వంద కోట్ల సినిమాతో ముగించడం మంచి కిక్ ఇస్తోంది. ఇప్పుడున్న యూత్ హీరోల్లో వెరైటీ రోల్స్ దూసుకుపోతోంది రణ్‌వీరే. దీపికా దీపికా ప‌దుకొనెను పెళ్లాడిన తర్వాత ఇంకా కిక్ వచ్చినట్టు ఉంది. తాజాగా మరో కొత్త సినిమా విడుదలకు రెడీ అవుతోంది. పేరు గల్లీ బాయ్.

Ranveer Singh

ముంబైలోని ఓ చిన్న గ‌ల్లీలో ఉండే యువ‌కుడి ఆధారంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ర‌ణ్‌వీర్ స‌ర‌స‌న అలియా భ‌ట్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. జోయా అక్త‌ర్ డైరెక్ట‌ర్‌. అయితే ర‌ణ్‌వీర్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అస్లీ హిప్ హాప్ పేరుతో త‌న ఫోటోను షేర్ చేయ‌డంతో ర‌ణ్‌వీర్ భార్య దీపికా ప‌దుకొనె… కామెంట్ చేసింది. ర‌ణ్‌వీర్.. నిన్నెవ‌రూ ఆప‌లేరు. ఐ ల‌వ్ యూ.. నిన్ను చూస్తుంటే నాకు గ‌ర్వంగా ఉందంటూ కామెంట్ చేసింది. వాలెంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14 న సినిమా రిలీజ్ అవ‌నుండ‌గా.. సినిమా ట్రైల‌ర్ మాత్రం జ‌న‌వ‌రి 9న రిలీజ్ కానుంది.

Deepika Padukone

- Advertisement -