సందీప్ వంగాపై విమర్శలు..దీపికా లైక్

2
- Advertisement -

ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం చుట్టూ తిరుగుతున్న వివాదం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా నుంచి దీపికా పదుకొణె తప్పుకోవడం, ఆ తర్వాత నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెను ముందుగా అనుకున్నప్పటికీ, ఆర్థికపరమైన మరియు సమయానికి సంబంధించిన నిబంధనల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చినట్లు నివేదికలు వచ్చాయి. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సోదరుడు, చిత్ర నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ… దీపికా ఈ సినిమా లాభాల్లో 10% వాటా డిమాండ్ చేశారు. దానికి తోడు రోజుకి 8 గంటలు మాత్రమే షూటింగ్ చేస్తాననే షరతు పెట్టారు. సినిమా బడ్జెట్ పరిమితుల దృష్ట్యా మేము ఆ షరతులకు ఒప్పుకోలేకపోయాము అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యల తర్వాత ఒక జర్నలిస్ట్ ఇన్స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. అందులో— హీరోలు లాభాల్లో వాటాలు అడిగితే లేని అభ్యంతరం, ఒక అగ్ర నటి అడిగితే ఎందుకు వివాదం అవుతోంది? ఇది పురుషాధిక్య భావజాలం మరియు మహిళలపై వివక్షకు నిదర్శనం అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్‌ను దీపికా పదుకొణె స్వయంగా ‘లైక్’ చేయడంతో, సందీప్ రెడ్డి వంగా మరియు వారి వ్యాఖ్యలపై ఆమె పరోక్షంగా తన నిరసనను వ్యక్తం చేసినట్లయింది.

Also Read:హార్ముజ్‌..అమెరికా భూభాగమే!

- Advertisement -