పవన్ మాటలు ఆనందాన్నిచ్చాయి

2
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, దర్శకుడు బాబీ (కె.ఎస్. రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ చిత్రం ‘మెగా 158’ (Mega 158) పూజా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బాబీ, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు.

సినిమా పూజా కార్యక్రమానికి స్వయంగా ఆహ్వానించేందుకు వెళ్లినట్లు తెలిపిన బాబీ, అత్యంత బిజీ షెడ్యూల్‌లోనూ పవన్ కళ్యాణ్ తమకు ఏకంగా 2 గంటల సమయం కేటాయించారని వెల్లడించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవి సినీ ప్రస్థానం, ఆయన క్రేజ్ గురించి మాట్లాడిన తీరు ఎంతో ఆకట్టుకుందని బాబీ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారని బాబీ చెప్పారు.అభిమానులు థియేటర్లలో అన్నయ్య స్టార్‌డమ్‌ను చూశారు. కానీ నేను 14 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచే చెన్నైలో ఆయనకున్న క్రేజ్‌ను చాలా దగ్గరుండి చూశాను అని పవన్ గుర్తుచేసుకున్నారు. చిరంజీవిని చూడటానికి వచ్చే అభిమానుల తోపులాట, తొక్కిసలాటల్లో తెగిపోయిన చెప్పులను లారీల్లో తీసుకెళ్లడం, చిరిగిపోయిన చొక్కాలను స్వయంగా చిన్నతనంలోనే చూశానని పవన్ వివరించారు.

Also Read:పెరుగు జిగురుగా ఎందుకు మారుతుంది?

ఒక తమ్ముడిగానే కాకుండా చిరంజీవికి అసలైన, నిజమైన అభిమానిగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు తమకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చాయని దర్శకుడు బాబీ సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -